తెలంగాణ

telangana

Dog Death Rituals In Hinduism

ETV Bharat / videos

Dog Death Rituals In Hinduism : పెంపుడు కుక్కకు కర్మకాండలు.. హిందూ సంప్రదాయాలతో పూజలు.. బంధువులకు భోజనాలు కూడా.. - హిందూ సంప్రదాయాలతో కర్మకాండలు

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 10:29 PM IST

Dog Death Rituals In Hinduism :చనిపోయిన పెంపుడు కుక్క కర్మకాండలను హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు ఓ వ్యక్తి. అంతే కాకుండా.. స్థానికులు, బంధువులను పిలిచి భోజనాలు కూడా పెట్టారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

జిల్లాలోని గాంధీపాడియా ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్​ మహాపాత్ర, బసంత మహాపాత్ర దంపతులు.. 2010లో ఓ కుక్కను పెంచుకున్నారు. దానికి గులు అని పేరు పెట్టారు. అనారోగ్యం బారిన పడ్డ గులు.. కొద్దిరోజుల క్రితం మరణించింది. దీంతో చంద్రశేఖర్​ కుటుంబం.. విషాదంలో మునిగిపోయింది. పెంపుడు కుక్క మృతదేహాన్ని.. తమ ఇంటి ఆవరణలో ఖననం చేశారు చంద్రశేఖర్​ కుటుంబసభ్యులు.

Hindu Rituals After Dog Death : అయితే గులును తన కుటుంబంలోనే ఒక సభ్యుడిగా భావించిన చంద్రశేఖర్.. కర్మకాండలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. పూజారిని రప్పించి గులు మరణించిన 7రోజులకు.. హిందూ సంప్రదాయాల ప్రకారం కర్మకాండలు నిర్వహించారు. స్థానికులు, బంధువులుకు పిలిచి భోజనాలు కూడా పెట్టారు. అయితే బసంత మహాపాత్ర సామాజిక కార్యకర్త కావడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details