పక్షవాతం వచ్చిన శునకానికి ఘనంగా బర్త్‌డే వేడుకలు.. వీధి కుక్కలకు స్పెషల్ ట్రీట్
ఉత్తర్‌ప్రదేశ్ మేరఠ్‌లో పక్షవాతం వచ్చిన ఓ కుక్కకు బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులు ఆనందంగా శునకం బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. గంగా నగర్ ప్రాంతానికి చెందిన పారామిలటరీ ఫోర్స్‌లో పనిచేసే అధికారి సోనియా గౌతమ్ ఈ వేడుకలు జరిపించారు. ఈ కుక్కను ఇంటికి తీసుకుని వచ్చినప్పటి నుంచి అదృష్టం కలిసి వచ్చిందని ఆమె అంటున్నారు. ఆ కుక్కకు కల్లూ అని పేరు పెట్టారు. గత ఐదేళ్లుగా రోడ్డుపై నివసించే జంతువులకు ఆమె ఆహారం అందిస్తున్నారు. కల్లూ బర్త్‌డే సందర్భంగా రోడ్డుపై నివసించే జంతువులకు స్పెషల్ ఫుడ్ ప్రిపేర్ చేసి వాటికి అందించారు. ఆమె ఇంట్లో దాదాపు రెండు డజన్ల జంతువులను పెంచుతున్నారు. వాటిలో చాలా కుక్కలు వైకల్యంతో బాధపడుతున్నాయి. ఇలాంటి జంతువుల కోసం ఆస్పత్రిని నిర్మించి.. వాటికి మెరుగైన వైద్యం అందించటమే తన లక్ష్యం అని సోనియా చెబుతున్నారు.