తెలంగాణ

telangana

Video of Dog attack on a young lady at Gachibowli

ETV Bharat / videos

Video Viral : అమ్మాయి కనిపించగానే.. కుక్క పిక్క లాగేసింది - హైదరాబాద్‌లో యువతిపై కుక్క దాడి

By

Published : Mar 28, 2023, 2:27 PM IST

Video of Dog attack on a young lady at Gachibowli : హైదరాబాద్‌లో మరోసారి వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు శునకాల దాడులపై ఎన్ని చర్యలు చేపట్టినా ప్రతిరోజు ఏదో ఓ చోటా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలోని ఖాజాగూడాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఖాజాగూడాలో ముగ్గురు అమ్మాయిలు ఓ షాప్‌లోకి వెళ్తున్నారు. వారి వెనకే ఓ శునకం ఫాలో ఫాలో అనుకుంటూ ఫాలో అయింది. దాన్ని చూసీ చూడనట్లుగా ఆ యువతులు తమ దారిన తాము వెళ్లారు. అంతలో అకస్మాత్తుగా కుక్క వారి ముందుకు దూసుకొచ్చింది. అందులో ఒక అమ్మాయి కాలిని పట్టుకుంది. ఆ అమ్మాయి కుక్కను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నించింది. పక్కన ఉన్న మరో అమ్మాయి గట్టిగా బెదిరించడంతో కుక్క అక్కడి నుంచి పరారైంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details