వీధికుక్కల స్వైర విహారం - ఒకేరోజు ఇద్దరిపై దాడి - వృద్ధురాలిపై వీధి కుక్కదాడి
Published : Dec 10, 2023, 12:11 PM IST
Dog Attack on 4 Years Old Boy in Warangal : ఒకే రోజు ఒకే గ్రామంలో ఇద్దరిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో చోటుచేసుకుంది. బాధితుల తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి, సరిత దంపతులకు విశ్వ(4) కుమారుడు ఉన్నాడు. ఆడుకోవడానికి వీధిలోకి రాగా వీధికుక్క ఆ బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. అక్కడే ఉన్న స్థానికులు కుక్కని తరిమేసి వెంటనే నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అదే మండల కేంద్రంలో బండి నర్సమ్మ అనే వృద్ధురాలు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో కుక్క ఆకస్మాత్తుగా దాడి చేసింది. ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రెండు ఘటనలపై స్పందించిన స్థానికులు వీధి కుక్కలపై అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వెంటనే అధికారులు స్పందించి వీధి కుక్కలపై చర్యలపై తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.