ఒక్క ఫోన్‌కాల్.. మీ ఇంటి దగ్గరికే వైద్యం..@అర్గల - తెలంగాణ తాజా వార్తలు
Argala Home Medical service : వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు ఒకదాని వెంట మరొకటి చుట్టుముడుతుంటాయి. ఆ సమయంలో వృద్ధులను చూసుకునేందుకు ఇంట్లో ఎవరూ లేకపోతే, దానికి మించిన బాధ ఇంకొకటి ఉండదు. ఇంకా ఈ వయస్సులో ఒంట్లో నలతగా ఉన్నా... ఆరోగ్యం విషమించినా ఆసుపత్రులకు వెళ్లే ఓపిక లేక అవస్థలు పడుతుంటారు. డబ్బున్న వారు అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అపాయింట్మెంట్ తీసుకొని సమయానికి అక్కడికి వెళ్లి క్షణాల్లో చికిత్స చేయించుకుంటారు.
అందరికి ఇక ఇంటి దగ్గరే వైద్యం: కానీ పేదలకి కుదరని పని వారు ప్రభుత్వాసుపత్రులకి వెళ్లి లైన్లో నించోని చికిత్స చేయించుకోవాల్సిందే. అలాంటి వారికోసం 'అర్గల' పేరుతో ఇంటి వద్దకే ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీదేవి. వృద్ధులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన వారు ఇంటికి వెళ్లి వైద్యం చేస్తారు. అసలు అర్గల స్థాపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది... ఈ సంస్థ ద్వారా ఎలాంటి సేవలు అందిస్తున్నారో వారినే అడిగి తెలుసుకుందాం.