RMP డాక్టర్ నిర్వాకం.. రోడ్డు పక్కనే యువకుడి మృతదేహం పడేసి..
హరియాణా గురుగ్రామ్‌లో ఓ ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం బయటపడింది. లీలాధర్ అనే 20 ఏళ్ల యువకుడు జ్వరంతో బాధపడుతూ ఆర్ఎంపీ డాక్టర్ ఫహీమ్ వద్దకు వెళ్లాడు. అకస్మాత్తుగా వైద్యుడు చేసిన చికిత్స వల్ల లీలాధర్ ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచాడు. క్లీనిక్ నడుపుతున్న ఫహీమ్, సుభాన్.. యువకుడి మృతదేహాన్ని అర్థరాత్రి.. వాహనంలో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి. సెప్టెంబరు 26 జరిగిన ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు.. నిందితుడు ఫహీన్ను అదుపులోకి తీసుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST