Do Heart Stents Need To Be Replaced : గుండెలోని స్టంట్లు మార్చడం సేఫేనా?.. వైద్యులు ఏమంటున్నారు? - తరచుగా హార్ట్ స్టెంట్లు మార్చాలా పూర్తి వివరాలు
Published : Sep 10, 2023, 6:44 PM IST
Do Heart Stents Need To Be Replaced : గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో వేసే స్టెంట్లు తరచూ మార్చడం అనేది మనిషి జీవనశైలితో పాటు అతడి ఆహారపు అలువాట్లపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు వైద్యులు. సాధారణంగా హార్ట్ పేషెంట్లలో వేసే స్టెంట్లు (Is It Safe To Replace Heart Stent) అతడి శరీరం లోపల అడ్జెస్ట్ అవ్వడానికి కనీసం 6 నుంచి 9 నెలలు పడుతుంది. అయితే ఇలా వేసిన స్టెంట్లు బ్లాక్ అయ్యే అవకాశాలున్నప్పటికీ అవి చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగుతాయంటున్నారు డా.చాణక్య కిషోర్.
శరీరంలో వేసిన స్టెంట్లు శరీర పరిస్థితులకు అలవాటు పడ్డాక సరైన డైట్ ప్లాన్ ఫాలో అవుతూ రోజూ వ్యాయామం, యోగా లాంటి వాటిని అనుకరిస్తే సుమారు 8 నుంచి 10 ఏళ్ల వరకు ఎటువంటి సమస్యలు రావని సూచిస్తున్నారు డాక్టర్లు. అదే స్టెంట్లు వేసిన తర్వాత కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించి పొగ తాగడం, మధుమేహం విషయాల్లో జాగ్రత్తలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే గనుక కేవలం 3, 4 ఏళ్లల్లోనే వేసిన స్టెంట్లు బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు కార్డియాలజిస్ట్ డా.చాణక్య కిషోర్. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ మళ్లీ స్టెంట్లు మార్చాల్సి వస్తుందని అంటున్నారు. మరి ఇలా రక్తనాళాల్లో తరచూ స్టెంట్లు మార్చడం సురక్షితమేనా? లేదా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియో చూసి తెలుసుకుందాం.