తెలంగాణ

telangana

DK Shivakumar on Telangana Election Results 2023

ETV Bharat / videos

కాంగ్రెస్‌ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు కేసీఆర్‌ యత్నం : డీకే శివకుమార్‌ - డీకే శివకుమార్​ తాజా వార్తలు

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 12:16 PM IST

DK Shivakumar on Telangana Election Results 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఆదివారం రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్​ పోల్స్ అన్నీ హస్తం పార్టీదే అధికారం అని ప్రకటించాయి. కారు రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నాయి. అయితే ఈ అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

DK Shivakumar Accuses KCR Of Trapping Congress Candidates :ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై​ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తాజాగా బెంగళూరులో స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ట్రాప్​ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని డీకే ఆరోపించారు. కేసీఆర్ స్వయంగా సంప్రదించిన విషయాన్ని పార్టీ అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సునాయాసంగా హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details