తెలంగాణ

telangana

Diwali Celebrations 2023 in Telangana

ETV Bharat / videos

దివ్వెల వెలుగుల్లో తెలుగు లోగిళ్లు- అంబరాన్నంటిన దీపావళి సంబురాలు - దీపావళి 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 10:38 PM IST

Diwali Celebrations 2023 in Telangana :చెడుపై.. మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా జరుపుకునే దీపావళి వేడుకలు(Diwali Celebrations).. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. దివ్య కాంతుల వెలుగులు, చిన్నారుల కేరింతలతో కాలనీలన్నీ సందడిగా మారాయి. లోగిళ్లతోపాటు.. దుకాణాల సముదాయాలు దీపాల వెలుగులో కాంతునీనాయి. ప్రజలందరూ లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 

Festival of Lights in Telangana :చిన్నా పెద్ద అంతా కలసి ఆనందోత్సాహాల నడుమ బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకుంటున్నారు. అంతా కలసి వెలుతురు పూలు విరజిమ్మే చిచ్చుబుడ్లు ,కాకర పువ్వొత్తులను కాలుస్తున్నారు. సంతోషాల వేళ ప్రమాదాలు జరగకుండా పిల్లల దగ్గర తల్లిదండ్రులు నిలబడి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎటువైపు చూసిన బాణసంచా శబ్దాలతో మార్మోగుతుంది.ఇంటిల్లిపాది ఒక్కచోటే చేరి ఉత్సాహంగా టపాసులు పేల్చారు. దివ్వెల వెలుగుల్లో తెలుగు లోగిళ్లు మెరిశాయి. అంతా కలసి ఒక్కొక్క దీపం వెలిగిస్తూ. చీకట్లని పారద్రోలినట్లు.. ఒకొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని నిర్మించుకుందాం అనే నినాదంతో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details