తెలంగాణ

telangana

ETV Bharat / videos

టీ విషయంలో గొడవ.. దాబాను ధ్వంసం చేసిన దుండగులు - చాయ్ గొడవ ఛత్తీస్​గఢ్

By

Published : May 23, 2022, 7:32 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Dispute over Tea price: చాయ్ రేటు విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మక ఘర్షణకు దారితీసింది. రాళ్లు రువ్వుకునే స్థాయికి చేరింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని రాజనందగావ్ ప్రాంతంలో జరిగింది. దుర్గ్- రాజనందగావ్ హైవేపై ఉన్న దాబా వద్దకు ఆదివారం ఉదయం కొందరు యువకులు వచ్చారు. వీరంతా ఒకే వర్గానికి చెందినవారని తెలుస్తోంది. టీ తాగిన తర్వాత దాబా యజమానితో యువకులు గొడవ పెట్టుకున్నారు. ఘర్షణ తీవ్రమై కొట్టుకునే వరకు వెళ్లింది. యువకులు.. దాబా నిర్వాహకుడిని, అక్కడ పనిచేసే వారిని కొట్టారు. కుర్చీలను విరగొట్టారు. పోలీసులకు సమాచారం చేరే లోపే దాబాను పూర్తిగా ధ్వంసం చేశారు. యువకుల్లో ఓ వ్యక్తి దాబా యజమాని దీపక్ బిహారీపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. నగరంలో నిర్వహించిన ఓ మతపరమైన కార్యక్రమానికే వీరంతా వచ్చారని తెలుస్తోంది. తిరిగి వెళ్తుండగా దాబా వద్ద ఆగినట్లు సమాచారం. దీనిపై పోలీసులు ఇంకా కేసు నమోదు చేసుకోకపోవడం గమనార్హం. మరోవైపు, బాధితులను స్థానిక ఎంపీ పరామర్శించారు. ఘటనపై దర్యాప్తు జరిగేలా చూస్తానని చెప్పారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details