తెలంగాణ

telangana

తెలంగాణలో పడుతున్న వర్షాలపై చర్చా

ETV Bharat / videos

Prathidwani: సీజన్ ఏదైనా.. వర్షాలు పడిన ప్రతిసారీ పరిస్థితి ఇంతేనా..?

By

Published : May 2, 2023, 9:55 PM IST

Prathidwani: హైదరాబాద్​లో మేఘాలు కమ్ముకొస్తున్నాయంటే.. భాగ్యనగర వాసుల్లో ఆందోళన మొదలవుతుంది. కొద్దిపాటి వర్షమే అయినప్పటికీ.. జనంపై చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. లోతట్టు ప్రాంతాలు జలమయం.. రోడ్లపై నిలుస్తున్న నీరు.. ఎక్కడికక్కడ ఆగిపోయిన ట్రాఫిక్..​ ఇవన్నీ సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. కేవలం 5, 6 సెంటిమీటర్ల వర్షానికే భాగ్యనగరం అంతా జలమయం అవుతుంది. నగరంలో వర్షాలతో అవస్థలు పడటం ఇదేమీ తొలిసారి కాదు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే సమస్య. పదే పదే సమస్య పునరావృతం అవుతున్నప్పటికీ పరిష్కారం ఎందుకు కనిపించట్లేదు? వేసవిలోనే ఇలా ఉంటే.. రానున్న వర్షాకాలంలో ఎలా ఎదుర్కోవాలి? సమస్యకు అసలు లోపాలు ఏంటి? సమస్య సృష్టించేందుకు ప్రధాన కారణాలు ఏంటి? దీన్ని ఎలా పరిష్కరించాలి? జల మండలి తమ పాత్ర సరిగ్గా నిర్వహిస్తుందా..? ఏటా ఇలానే ఉంటే నగరవాసుల పరిస్థితి ఏంటి..? వాన నీటి సంరక్షణ, చెరువుల పరిరక్షణ ప్రణాళికలు ఏవి?  ఇదే అంశం మీద నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details