తెలంగాణ

telangana

Old Couple

ETV Bharat / videos

MGM Hospital Viral Video : భుజాలపై మోసుకుంటూ భార్యకు వైద్యం.. వృద్ధాప్యమైనా ప్రేమ తగ్గేదే లే

By

Published : May 13, 2023, 12:00 PM IST

Updated : May 13, 2023, 1:50 PM IST

MGM Hospital Viral Video : వరంగల్ ఎంజీఎం​లో వైద్యానికి వచ్చిన వృద్ధురాలిని భుజాలపై మోసుకెళ్లిన ఓ భర్త వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వృద్ధురాలు లక్ష్మికి కొద్ది రోజుల కిందట శస్త్ర చికిత్స చేసి అరిపాదం తొలగించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ చేయించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో శుక్రవారం వృద్ధురాలి కాలికి కట్టు కట్టాక.. సిబ్బంది ఆమెను వీల్​ ఛైర్​లో బయట దింపారు. ఈలోగా కృత్రిమ కాలు అమర్చే విభాగానికి వెళ్లిన భర్త లచ్చులు సిబ్బంది శనివారం వస్తారని చెప్పారు. దీంతో మళ్లీ కొత్తగూడెం వెళ్లి రావడం కష్టమని భావించిన లచ్చులు.. భార్యను వీపుపై మోసుకుంటూ ఆసుపత్రి ప్రాంగణంలోని చెట్టు నీడకు చేర్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్‌ వివరణ ఇచ్చారు. 

కొత్తగూడెంనకు చెందిన లక్ష్మికి నవంబర్​లో ఆపరేషన్ చేసి కాలును తొలగించామని.. 15 రోజులకు ఒకసారి డ్రెస్సింగ్ కోసం ఎంజీఎంకు వస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ కాలును అమర్చేందుకు పేషెంట్ లక్ష్మిని సిబ్బందికి సమాచారం ఇవ్వకుండానే భర్త చెట్టు కింద కూర్చోబెట్టి.. కాలిపర్ సెంటర్ వద్దకు వెళ్లి వచ్చారని చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదన్నారు.

Last Updated : May 13, 2023, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details