నీటితో నిండిపోయిన మార్గం.. పరేషాన్ అవుతున్న జనం - telangana latest news
problems for motorists due to bridge construction: నిజామాబాద్ నగర శివారులో గల మాధవ నగర్ రైల్వే గేటు పైవంతెన నిర్మాణం జరుగుతుంది. దీంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. చుట్టు పక్కల ప్రాంతాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాధవ నగర్ రైల్వే గేట్ పైవంతెన నిర్మాణం కొనసాగుతుండటంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ మార్గం ద్వారా వాహనాల రాకపోకలకు అనుమతిని నిషేధించారు. చిన్న చిన్న ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వంటివి వచ్చి పోవడానికి మాధవ నగర్ గ్రామం నుంచి రైల్వే ట్రాక్ అంతర మార్గం ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారు. పంట పొలాల నుంచి నీరు వచ్చి చేరడంతో రైల్వే ట్రాక్ అంతర్ మార్గం పూర్తిగా నీటితో మునిగిపోయింది. దీంతో నిజామాబాద్ నుంచి డిచ్పల్లివైపు వెళ్లే మాధవనగర్ చుట్టు పక్కల ప్రాంతాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీటిని తోడి పోసి.. సమస్యను పరిష్కరించాలని వాహనదారులు సంబంధిత అధికారులకు విన్నవించుకుంటున్నారు.
TAGGED:
మార్గం మధ్యలో నిలిచిన నీరు