తెలంగాణ

telangana

Diesel Tanker Accident at Jagtial

ETV Bharat / videos

ట్రాన్స్​ఫార్మర్​ను ఢీకొని డీజిల్ ట్యాంకర్​ బోల్తా - భా​రీగా ఎగిసిపడిన మంటలు, తప్పిన పెనుప్రమాదం - Accident in Jagtial

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 1:19 PM IST

Diesel Tanker Accident at Jagtial : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి శివారులో జాతీయ రహదారిపై డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. వెంకట్రావుపేట పెట్రోల్ పంప్‌ సమీపంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో మెట్‌పల్లి వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్‌లో డీజిల్‌ ఉండడంతో ఇరువైపులా వాహనాలను నిలిపేసిన పోలీసులు, పరిసరాల్లోకి ఎవరినీ రానివ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.  

Diesel Tanker Hit Transformer in Jagtial :ప్రమాదానికి గురైంది డీజిల్‌ ట్యాంకర్‌ కావడంతో పాటు పక్కనే పెట్రోల్‌ బంక్‌, గురుకుల విద్యాలయం ఉండటంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details