తెలంగాణ

telangana

Diamond Necklace For Ayodhya Ram Mandir

ETV Bharat / videos

అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్​తో నెక్లెస్​- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక! - అయోధ్య రామమందిరానికి వజ్రాల నెక్లెస్ కానుక

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 11:41 AM IST

Diamond Necklace For Ayodhya Ram Mandir :గుజరాత్​లోని సూరత్​కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి అయోధ్య రాముడికి 5వేల అమెరికన్ డైమండ్స్​తో నెక్లెస్ తయారు చేయించారు. రామాయణంలోని ముఖ్య పాత్రలను ఈ హారంపై తీర్పిదిద్దారు కళాకారులు. దీనిని అయోధ్య రామమందిర ప్రారంభం సందర్భంగా కానుకగా ఇవ్వాలనుకుంటున్నానని వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా తెలిపారు. 

సూరత్​కు చెందిన వజ్రాల వ్యాపారైన కౌశిక్ కకాడియా ఓ నెక్లెస్​ను అయోధ్య రామమందిరానికి కానుకగా ఇవ్వాలని భావించారు. నెక్లెస్​ల తయారీలో నైపుణ్యం ఉన్నటువంటి 40 మంది కళాకారులకు ఈ పని అప్పగించారు. ఇందుకోసం వారు 5వేల అమెరికన్ వజ్రాలను, 2 కిలోల వెండిని ఉపయోగించి 35 రోజులు శ్రమించి తయారు చేశారు. నెక్లెస్​పై అయోధ్య రామమందిర నమూనాతో పాటు రామాయణంలోని ముఖ్యపాత్రలను చిత్రీకరించారు. ఈ నెక్లెస్​ను ఎటువంటి లాభాపేక్ష లేకుండా అయోధ్య రామమందిరానికి కానుకగా ఇస్తానని వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా తెలిపారు. 
అయోధ్య రామమందిరంలో రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమంలో 15-20 వేలమంది సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లను పూర్తి చేసింది అయోధ్య రామమందిర ట్రస్ట్. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొందరు ప్రముఖులు హాజరుకానున్నారు. 

ABOUT THE AUTHOR

...view details