రాళ్లు రువ్వుకునే జాతర మీరెప్పుడైనా చూశారా - ధామీ లేటెస్ట్ న్యూస్
అక్కడి ప్రజలు రాళ్లు రువ్వుకోవడాన్ని చూస్తే ఏదో ఆందోళన జరుగుతోందేమో అని అనిపిస్తుంటుంది. గొడవపడి ఒకరిపై ఒకరు కసిగా దాడి చేసుకుంటున్నారేమో అని అనుకుంటాం. కానీ అది గొడవ కాదు. వారికి ఒకరిపై మరొకరికి కోపమేమీ లేదు. సంప్రదాయంలో భాగంగానే ఇలా రాళ్లు రువ్వుకుంటుంటారు. హిమాచల్‌ప్రదేశ్ రాజధాని శిమ్లాలో శతాబ్దాలుగా జరగుతున్న ధామి స్టోన్ పెల్టింగ్ ఫెయిర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. దీపావళి తర్వాత రెండో రోజు జరుపుకునే ఈ జాతరలో ఆ గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. అలా దాడిలో గాయపడ్డ వ్యక్తికి వచ్చే రక్తాన్ని కాళీ మాత మండపానికి పూస్తారు. పూర్వ కాలంలో ఇక్కడ నరబలులు జరిగేవని.. తర్వాతి కాలం అది జంతు బలిగా మారిందని ఆఖరికి అవన్ని నిలిపివేసిన రాజవంశీయులు ఈ రాళ్ల జాతరని ప్రారంభించారని స్థానికులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST