తెలంగాణ

telangana

కోవిడ్

ETV Bharat / videos

'రాష్ట్రంలో కరోనా కేసుల్లేవు.. అయినా అప్రమత్తత అవసరం' - Preventive measures against sunburn

By

Published : Apr 6, 2023, 10:02 AM IST

DH Srinivas on Corona cases in Telangana : దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ కొత్త వేరియంట్​ను "వేరియంట్ ఆఫ్ కన్సర్న్" గా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. బూస్టర్ డోసులను అందించటంతోపాటు.. కరోనా పాజిటివ్​ కేసులు ఉన్నపళంగా పెరుగుతున్న ప్రాంతాల్లో కాంటాక్టులను గుర్తించి టెస్టులు చేయాలని స్ఫష్టం చేసింది. 

అయితే గత కొంత కాలంగా రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా లేకపోవటం గమనార్హం. ఈ క్రమంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు రాష్ట్రంలో కుక్కకాటు బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పలు సంఘటనల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంకోవైపు వేసవి షురూ అయింది. ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు సహా.. కుక్కకాటు బాధితులకు వైద్యం, వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజా రోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావుతో ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details