తెలంగాణ

telangana

Telangana Decade celebrations 2023

ETV Bharat / videos

Telangana Decade celebrations 2023 : ఆధ్యాత్మిక ఔనత్యాన్ని చాటేలా తెలంగాణ పుణ్యక్షేత్రాల అభివృద్ధి - రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2023

By

Published : Jun 21, 2023, 11:45 AM IST

Telangana Devotional day Today :దశాబ్ది వేడుకల్లో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహిస్తున్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలను అలంకరించడంతో పాటుగా ప్రత్యేక కార్యక్రమాలను జరుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి తెలిపారు. కొత్తగా 2,043 ఆల‌యాల‌కు ధూపదీప నైవేద్య ప‌థ‌కం అమ‌లుకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రిలో మిల్లెట్ ప్రసాద సేవ‌ల‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆధ్యాత్మిక చింతన క‌లిగిన‌ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఆలయాలు, సంప్రదాయాలు, పండుగలు, వేడుకలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని వెల్లడించారు. 

యావత్ తెలంగాణ ప్రజలను దీవిస్తున్న.. యాదాద్రి ఆలయ పునః నిర్మాణం ప్రపంచానికే ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ శోభాయమైన నిర్మాణమే తెలంగాణ ప్రతిష్ఠతను నెలకొల్పిందని చెప్పారు. తెలంగాణ ఆధ్యాత్మిక ఔనత్యాన్ని దశదిశలా చాటేలా పుణ్యక్షేత్రాల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. అద్భుతమైన వాస్తు, శిల్పకళతో యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణం.. కొండగట్టు అంజన్న ఆలయ నిర్మాణానికి రూ.500 కోట్లు, వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు చొప్పున కేటాయించారు. అలాగే రాష్ట్ర పండుగగా బోనాల పండుగ అధికారికంగా బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను ప్రభుత్వం నిర్వహిస్తోందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details