1000 కొబ్బరికాయలను తలపై కొట్టించుకొన్న భక్తులు - తమిళనాడు కనకదాస ఉత్సవాలు
తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని హోసూరు కనకదాస సేవా సమితి ఆధ్వర్యంలో కనకదాస 535వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో పాల్గొన్న భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకొని తమ భక్తిని చాటుకున్నారు. పూజారి చేతుల మీదుగా వందలాది భక్తులు తమ తలపై 1,008 కొబ్బరికాయలను కొట్టించుకున్నారు. దేవుడి విగ్రహాలను తలపై మోస్తూ నృత్యాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు తమిళనాడుతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా రక్తదానం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST