శిర్డీ సాయికి బెంగళూరు భక్తుడి భారీ కానుక - రూ.29 లక్షల విలువైన బంగారు కిరీటం అందజేత - శిర్డీ సాయి ఆలయం
Published : Jan 9, 2024, 5:47 PM IST
Devotee Donates Golden Crown for Shirdi Saibaba: బెంగళూరుకు చెందిన భక్తుడు శిర్డీ సాయి నాథునికి బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. 29 లక్షల 4 వేల 982 రూపాయలు విలువైన ఈ కిరీటాన్ని మంగళవారం సాయి బాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తుకారాం హులావ్లేకు అప్పగించారు. బంగారు కిరీటాన్ని విరాళంగా అందజేసిన డాక్టర్ కోట రాజారాం దంపతులను సాయి సంస్థాన్ అధికారులు శాలువాతో సత్కరించి బాబా విగ్రహాన్ని అందజేశారు.
శిర్డీ క్షేత్రంలో వెలసిన దైవం సాయిబాబాను దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల అపార నమ్మకం. తమ కోర్కెలు నెరవేరినప్పుడు భక్తులు హృదయపూర్వకంగా ఆలయానికి వచ్చి బాబాను దర్శించుకుని విరాళాలు సమర్పిస్తుంటారు. హుండీలో డబ్బులు, నగదు, బంగారం వంటి వాటిని కూడా సాయి బాబాకు భక్తి పూర్వకంగా ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా శిర్డీ సాయి బాబాకు కానుకలు వెల్లువెత్తున్నాయి. ఇటీవలే ఓ కుటుంబం సాయి సంస్థాన్‌కు తమ రెండంతస్తుల భవనాన్ని కానుకగా ఇచ్చారు. దీంతో తన భర్త కల నెరవేరిందని ఓ భక్తురాలు తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.