సాయిబాబా పాదాలు మొక్కుతూ గుండెపోటుతో భక్తుడు మృతి - మధ్యప్రదేశ్‌లో బాబా పాదాల వద్ద మరణించిన భక్తుడు
మధ్యప్రదేశ్ కట్నీలోని పహరువా మండి రోడ్డు వద్ద ఉన్న సాయి బాబా ఆలయంలో ఓ విషాదకర ఘటన జరిగింది. రాకేశ్ మెహానీ అనే వ్యక్తి బాబా గుడిలో దేవుడి పాదాలు మొక్కుతూ మృతి చెందాడు. ఆయనకు సాయినాథుడంటే చాలా భక్తి. ఆయన ప్రతి గురువారం బాబా దర్శనం నిమిత్తం గుడికి వెళ్తుండేవాడు. అయితే ఎప్పటిలాగానే డిసెంబరు 1వ తేదీన కూడా సాయిబాబా టెంపుల్కి వెళ్లాడు. అక్కడ బాబా పాదాలకు మొక్కుతూ అలానే ఉండిపోయాడు. అదే సమయంలో గుడిలో ఉన్న భక్తులకు అనుమానం వచ్చి చూస్తే ఆయన మరణించిన విషయం తెలిసింది. అయితే ఆయన గుండెపోటుతో మరణించాడని సమాచారం.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST