Dengue Fevers in Telangana : దోమలే యమ డేంజర్.. డెంగీ నివారణపై గాంధీ సూపరింటెండెంట్ సూచనలివే
Published : Oct 21, 2023, 10:06 AM IST
Dengue Fevers in Telangana :రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా నమోదవుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 6 వేల మందికి డెంగీ సోకినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా డెంగీ కేసుల సంఖ్య లక్షకు చేరువగా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు జూన్ నుంచి ఆగస్టు వరకే ఎక్కువగా వ్యాపించే డెంగీ.. ఈ ఏడాది అక్టోబర్ వచ్చినా తగ్గడం లేదు. సాధారణంగా డెంగీ మాములు జ్వరమైనా.. కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతోంది. ఈ వ్యాధి పట్ల అందరికీ అవగాహన అవసరం.
Gandhi Superintendent Raja Rao Interview : ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి..? డెంగీ వ్యాధి సోకిన వారిలో ప్లేట్ లెట్ల మార్పిడి ఎంత వరకు అవసరం..? శరీరంపై రక్తపు దద్దుర్లు దేనికి సంకేతం.?. డెంగీ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యలేంటి అనే అంశాలపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..