లక్ష్యసాధనలో విఫలమవుతున్న యువత - అధిగమించడం ఎలా? - New Year Resolution tips
Published : Jan 1, 2024, 9:58 PM IST
Debate on New Year Resolution 2024 : జీవితంలో ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆ లక్ష్యాల కోసం ఎప్పటికప్పుడు మనల్ని మనం పునరంకితం చేసుకుంటూ ఉండాలి. అందుకు కొత్త సంవత్సరం తీర్మానాలు సరైన సాధనాలు. గతేడాది వైఫల్యాల్ని పక్కకునెట్టి, ఉన్నచోటు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సదవకాశం కల్పిస్తుంది నూతన సంవత్సర తీర్మానం. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు ఇలా ఎవరికి వారు తమ నైపుణ్యాలు మెరుగు పర్చుకునేందుకు, కొత్తశిఖరాలు చేరుకునేందుకు చేయందిస్తుంది. ప్రతిజ్ఞ చేసుకున్నఆకొత్త ఏడాది సంకల్పాల్ని చేరుకోవడం ఎలా?
లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను ఎలా అధిగమించాలి? న్యూ ఇయర్ తీర్మానాలనే కాదు, ఒక నిర్ణయం తీసుకున్నాక కట్టుబడి ఉండడం అంత కష్టమా? మన తీర్మానాలు, నిర్ణయాల సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ప్రభావం మానసిక ఆరోగ్యంపై ఎలా ఉంటుంది? ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? చాలామంది వద్దనుకున్న బాధలు, కష్టాల వెనకాలే తిరిగి పరుగు పెడుతుంటారు. ఆ కంట్రోల్ ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.