డ్యాన్స్ చేస్తూ స్టేజ్‌పైనే గుండెపోటుతో కుప్పకూలిన మహిళ - పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండేపోటు
మధ్యప్రదేశ్‌లోని ఓ పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. సంగీత్ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తున్న మహిళ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. సివనీ జిల్లాలో బఖారీ గ్రామానికి చెందిన యశోద వివాహానికి వెళ్లింది. పెళ్లి బృందం ఏర్పాటు చేసిన సంగీత్‌లో తన అక్కచెల్లెళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా వేదికపైనే గుండెపోటుతో కుప్పకూలింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST