బైక్‌పై సోదరి మృతదేహంతో సోదరుడి ప్రయాణం- అంబులెన్స్ లేకపోవడం వల్లే! - Transportation of dead body by bike
Published : Nov 8, 2023, 2:25 PM IST
Dead Body On Bike Viral Video : అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లాడు ఓ యువకుడు. ఈ హృదయ విదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో బుధవారం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేమైందంటే?
జిల్లాలోని నవీన్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి(20).. ఆన్ చేసి ఉన్న వాటర్ హీటర్‌ను ప్రమాదవశాత్తు తాకింది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను బిధునా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కుటుంబసభ్యులు. అప్పటికే అంజలి మరణించినట్లు సీహెచ్‌సీ వైద్యులు ధ్రువీకరించారు.
అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సీహెచ్‌సీ సిబ్బందిని ఆమె సోదరుడు కోరాడు. అయితే ఆస్పత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల తన బైక్‌పైనే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అంజలి మృతదేహాన్ని దుప్పటితో చుట్టి.. బైక్‌పై ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.