తెలంగాణ

telangana

DCM Van Rammed into a House in Jagtial

ETV Bharat / videos

ఇంట్లోకి దూసుకెళ్లిన డీసీఎం - భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు - జగిత్యాలలో లారీ యాక్సిడెంట్​

By ETV Bharat Telangana Team

Published : Dec 5, 2023, 9:31 PM IST

Updated : Dec 5, 2023, 10:53 PM IST

DCM Van Rammed into a House in Jagtial : సహజంగా యాక్సిడెంట్​ రోడ్లపై జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే ఇందులో కొత్తగా ఏముంది అని అనుకుంటున్నారు కదా. కానీ ఏకంగా ఓ డీసీఎం వ్యాన్​ ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో జరిగింది. మెట్​పల్లి మండలంలోని తండా నుంచి కోరుట్ల వైపు ధాన్యం లోడ్​తో వెళ్తున్న డీసీఎం వ్యాన్​, మూలమలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి సమీపంలో ఉన్న ఇంట్లోకి వేగంతో దూసుకు పోయింది.

దీంతో ఒక్కసారిగా ఇంటి సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం వల్ల ఇంటి గోడ కూలి ఇంట్లోని వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఇంటి మీదికి దూసుకొచ్చిన లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఆ లారీలో ఉన్న ధాన్యం బస్తాలన్నీ మరో లారీలోకి తరలించారు. అనంతరం లారీని బయటికి తీశారు.  

Last Updated : Dec 5, 2023, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details