కన్నబిడ్డపై కర్కశత్వం.. మెడకు టవల్ చుట్టి దారుణంగా కొట్టిన తండ్రి - చిత్రహింసలు
Daughter beaten by father: కన్నబిడ్డతో కర్కశంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. చేయి, కర్రతో కొట్టడమే కాకుండా మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చిత్రహింసలు పెట్టాడు. పంజాబ్, బఠిండా జిల్లా రామ్పుర గ్రామంలో జరిగింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నిర్మల్ సింగ్ అనే వ్యక్తి తన 8 ఏళ్ల కుమార్తెను కొడుతుంటే పక్కనే ఉన్న వ్యక్తి ఆపాల్సిందిపోయి వీడియో తీస్తూ ఉండిపోయాడు. ఈ దృశ్యాలను బాధితురాలి తల్లి చూసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు నిర్మల్ సింగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST