Dark Chocolate Benefits : డార్క్ చాక్లెట్స్తో బహుళ ఆరోగ్య ప్రయోజనాలు.. బీపీ, సుగర్లతో సహా గుండె జబ్బులకు చెక్! - డార్క్ చాక్లేట్తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
Published : Sep 12, 2023, 5:24 PM IST
Dark Chocolate Health Benefits :డార్క్ చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. సాధారణంగా చాక్లెట్స్ అతిగా తినవద్దు అని అంటూ ఉంటారు. కానీ డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
Benefits Of Dark Chocolate :డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవనాల్స్, పాలిఫినాల్స్ అనే కాంపౌండ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండెతో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడతాయి. అలాగే క్యాన్సర్ కారకాలను దూరంగా ఉంచేందుకు కూడా ఈ డార్క్ చాక్లెట్ దోహదం చేస్తుంది. డార్క్ చాక్లెట్స్లో సాధారణంగా ఫైబర్ కెంటెంట్ కూడా ఉంటుంది. అయితే మనకి మార్కెట్లో లభించే డార్క్ చాక్లెట్స్లో.. ఫైబర్ కంటెంట్ తక్కువగా.. షుగర్, ఫ్యాట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే వీటిల్లో క్యాలరీ కంటెంట్ అధిక శాతంలో ఉంటుంది. అయితే క్యాలరీస్ను ఎక్కువగా కాకుండా పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా రోజుకు 30 నుంచి 40 గ్రాములు మించకుండా డార్క్ చాక్లెట్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.