తెలంగాణ

telangana

Damodara Rajanarsimha

ETV Bharat / videos

'కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే ఒక్క మాట మాట్లాడలేదు మోదీ' - తెలంగాణ ఎన్నికల ప్రచారం 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 12, 2023, 10:24 PM IST

Damodara Rajanarsimha Reaction on PM Modi Speech : చిన్న రాజ్యాంగ సవరణ చేస్తే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని నాటి కమిటీ తేల్చిందని.. అది చేయకుండా మళ్లీ కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్రమోదీ అంటే ఎలా..? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్​లోని గాంధీభవన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అవినీతి సొమ్ము ప్రతి రూపాయి పేదలకు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ వీడియో ప్రదర్శించారు. 75 ఏళ్లలో కాంగ్రెస్ దళితులను అవమానించిందని.. అసలు ఎప్పుడు క్షేమం కోరలేదని హైదరాబాద్ సభలో మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడరని ఆరోపించారు. 

Damodara Rajanarsimha Latest Comments :రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు సహా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే ఒక్క మాట మాట్లాడలేదని దామోదర రాజనర్సింహ ధ్వజమెత్తారు. అంబేడ్కర్ మేధస్సు గుర్తించింది కాంగ్రెస్.. డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్‌ను చేసిందన్నారు. ఎన్నికల్లో కులాలను ఎలా ఉపయోగించాలని బీజేపీ చూస్తుందని ఆరోపించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలన్నింటినీ దళితులు, మాదిగలు అందరూ గమనిస్తున్నారని తెలిపారు. కేవలం ఓట్లు విభజన కోసం చూస్తున్నారు తప్ప.. ఇది మరొకటి కాదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైపు దళితులు ఉన్నారని.. వాళ్లు అన్ని గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  

ABOUT THE AUTHOR

...view details