లైకుల మోజులో సైబర్ దాడులకు గురవుతున్నారు - వీటిని ఫాలో అవ్వాలంటున్న సైబర్ నిపుణులు - తెలంగాణలో పెరుగుతున్న సైబర్ మోసాలు
Published : Dec 8, 2023, 5:09 PM IST
Cyber Crimes More in Telangana :సాంకేతికత పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అయితే ఇందులో చిక్కుకుంటున్న యువత ఇంటర్నెట్, కంప్యూటర్ స్పామ్, డేటా చౌర్యం లాంటి వాటి బారిన పడుతూ మోసపోతున్నారు. ప్రధానంగా ఈ మోసాల బారిన పడుతున్న వారిలో 15ఏళ్ల నుంచి 24 వయస్సు గలవారు అధికారంగా ఉంటున్నారు. నిరుద్యోగ యువతే టార్గెట్‌గా ఇలాంటి మోసాలు జరగడం ఇటీవల సర్వసాధారణమయ్యాయి. వారిని అదునుగా చేసుకుని డబ్బులు దోచుకుంటున్న ఘటనలు దేశ వ్యాప్తంగా చాలా చోటుచేసుకుంటున్నాయి.
ఇలా యువత, విద్యార్థులు సైబర్ మోసాల్లో చిక్కుకున్న తర్వాత మోసపోయామని తెలిసి కూడా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా లాభం లేకుండా పోతోంది. ఇంతకి అసలేంటి ఈ మోసాలు..? యువత వీటి బారిన పడటానికి ప్రధాన కారణమేంటి? ఎన్సీఆర్బీ రిపోర్ట్ నివేదిక ఏం చెబుతోంది? ఇలాంటి మోసాల బారిన పడకుండా యువత తీసుకోవాల్సిన జాగ్రతలేంటి? లాంటి అంశాలపై సైబర్ నిపుణులు అనిల్ రాచమల్ల సూచనలు.