తెలంగాణ

telangana

Cyber ​​Crimes In The Name Of FedEx Courier Company

ETV Bharat / videos

మీకొచ్చిన కొరియర్​లో డ్రగ్స్ ఉన్నాయని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? - బీకేర్​ఫుల్ - FedEx Courier Company Cyber ​​Crime

By ETV Bharat Telangana Team

Published : Jan 17, 2024, 2:18 PM IST

Cyber ​​Crimes In The Name Of FedEx Courier Company : సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో నేరాలకు పాల్పడతున్నారు. ఇటీవల ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరుతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. గతేడాది హైదరాబార్ కమిషనరేట్ పరిధిలో 50కి పైగా కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికే 6కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధుల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు బాధితుల నుంచి లక్షలు కాజేస్తున్నారు.

ముంబయి పోర్ట్ నుంచి తైవాన్, ఇతర దేశాలకు మీ పేర్లతో డ్రగ్స్, ఇతర పార్శిళ్లు వెళుతున్నాయని ఫోన్లు చేస్తున్న నేరగాళ్లు పోలీస్​ వేషంలో వీడియో కాల్ చేసి అరెస్ట్ వారెంట్​లు, బేడీలు చూపిస్తున్నారు. భయంతో నేరగాళ్లు చెప్పిన ఖాతాలకు బాధితులు నగదు బదిలీ చేస్తున్నారు. ఇటీవల నగరానికి చెందిన బాధితురాలి నుంచి ఇలాగే రూ.80లక్షలు కాజేశారు. మరోకేసులో తార్నాకకు చెందిన బాధితురాలి నుంచి ఆరు లక్షలు, శేర్లింగంపల్లికి చెందిన బాధితురాలి నుంచి 14.50లక్షలు కాజేశారు. ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కేటుగాళ్లకు భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్న హైదరాబాద్ సైబర్ క్రైం ఎసీపీ శివ మారుతీ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details