తెలంగాణ

telangana

Cybercrime SI Rajender Arrested in Drug Case

ETV Bharat / videos

Cyber Crime SI Arrested in Drugs Case : డ్రగ్స్ పట్టివేతలో చేతివాటం.. సైబర్‌ క్రైమ్ ఎస్సై అరెస్ట్.. రిమాండ్​కు తరలింపు - డ్రగ్స్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ ఎస్సై రాజేందర్‌

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 1:19 PM IST

Cyber Crime SI Arrested in Drugs Case:సైబరాబాద్ సైబర్ క్రైమ్​ ఎస్సై​ని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. సైబరాబాద్ కమిషనరేట్​లో పని చేస్తున్న రాజేందర్ ఫిబ్రవరి నెలలో సైబర్ నేరంలో భాగంగా ముంబయి వెళ్లారు. అక్కడ సైబర్ మోసానికి పాల్పడిన నైజీరియన్​ను అరెస్టు చేశారు. ఈ  క్రమంలో నైజీరియన్ వద్ద ఉన్న 1,750 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్సై రాజేందర్ గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకుని ఇంట్లో దాచాడు. అనంతరం ఆ మాదకద్రవ్యాలను విక్రయించేందుకు రాజేందర్ ప్రయత్నించాడు. 

రాష్ట్ర నార్కోటిక్ విభాగం పోలీసులకు సమాచారం అందడంతో నార్కోటిక్ విభాగం పోలీసులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఉండే రాజేందర్ ఇంట్లో దాడి చేసి.. రూ.80 లక్షల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు రాజేందర్​ను అప్పగించారు. రాజేందర్​పై ఎన్​డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు రాయదుర్గం పోలీసులు తెలిపారు. గతంలోనూ రాయదుర్గం పోలీస్​స్టేషన్​లో రాజేందర్ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో అనిశాకు పట్టుబడి ఆ కేసులో సస్పెండ్ అయ్యారు. అయితే హైకోర్టులో స్టే తెచ్చుకొని తిరిగి సైబర్ క్రైమ్​లో ఎస్సైగా చేరారు.

ABOUT THE AUTHOR

...view details