తెలంగాణ

telangana

high Current Bill Issue

ETV Bharat / videos

Current Bill Issue in Siddipet : 'ఇదేందయ్యా ఇది.. ఇంత కరెంట్ బిల్లు మాకెప్పుడు రాలే' - high Current Bill Issue at Koheda

By

Published : Aug 10, 2023, 1:52 PM IST

Current Bill Issue in Siddipet  :ప్రతి నెల కరెంటు బిల్లు రూ.200 వచ్చేవారికి ఒక నెల మూడు వందలు వస్తే కాస్త ఎక్కవ వాడామేమో అనుకొని సరిపెట్టుకుంటారు. ఏకంగా రూ.1600 వందలు వస్తే ఎలా ఉంటుంది గుండె బరువెక్కిపోతుంది. ఇలాంటి పరిస్థితే సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో చోటుచేసుకుంది. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ లో నెల రోజుల ఇంటి కరెంట్ బిల్లులు ఎక్కువ రావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి నెల రూ.200 లోపు వచ్చే కరెంటు బిల్లు ఒకేసారి రూ.1600 వరకు రావడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. వెంటనే విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్​ను పిలిపించి నిలదీశారు. దీంతో కాసేపు గ్రామస్థులకు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్​కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 

High Electricity Bill in Siddipet : ఈ విషయమై లైన్ ఇన్స్పెక్టర్​ను వివరణ కోరగా లోడ్ ఎక్కువ వాడుకున్నందుకు, జీఎస్టీ కలుపుకొని విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందని అది డిపాజిట్ రూపంలో వినియోగదారుని బిల్లులోనే ఉంటుందని తెలిపారు. కానీ గ్రామస్థులేమో.. తమ ఊళ్లో పది మందికి పైగా రూ.1616 కరెంట్ బిల్లు వచ్చిందని, పొరపాటున వచ్చిందని లైన్ ఇన్స్పెక్టర్ అంటున్నారని మరో మాట చెబుతున్నారు. పొరపాటున వచ్చినప్పుడు పేర్లు సరిగా ఎలా వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details