Currency Notes On Singer Viral Video : కచేరీలో సింగర్పై నోట్ల వర్షం.. ఆ డబ్బులతో ఏం చేస్తారంటే? - గుజరాత్ సింగర్పై నోట్ల వర్షం
Published : Oct 8, 2023, 9:43 AM IST
Currency Notes On Singer Viral Video : గుజరాత్‌లోని అహ్మదాబాద్లో జానపద గాయని అల్పా పటేల్ కరెన్సీ నోట్లలో మునిగిపోయింది! స్టేజీ మీద ఆమె పాడుతున్నంతసేపు అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. బకెట్లతో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించారు. దీంతో ఆ వేదిక మొత్తం రూ.లక్షల నోట్లతో నిండిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ అభిమానాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన రూ.లక్షలను గోశాల నిర్మాణం కోసం ఉపయోగించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
కొద్దిరోజుల క్రితం.. గుజరాత్లో ఆకాశం నుంచి నోట్ల వర్షం కురిసింది! గాల్లో ఎగిరిపడుతున్న 100, 200, 500 రూపాయల నోట్లను అందుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. తమ కుమారుడి వివాహం సందర్భంగా ఓ కుటుంబం ఈ పని చేసింది. ఇంటిపై నుంచి నోట్లను వెదజల్లింది. మహేసాణా జిల్లా, కడీ తాలుకాలో డాబాపై ఉన్న ఓ వ్యక్తి రూ.500 నోట్లను గాల్లోకి వెదజల్లుతుండగా.. అక్కడే ఉన్న వారంతా వాటిని అందుకునేందుకు ఎగబడటం వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.