తెలంగాణ

telangana

75 మంది మహిళ సీఆర్​పీఎఫ్​ జవాన్​ల బైక్​ ర్యాలీ

ETV Bharat / videos

మహిళ CRPF జవాన్ల బైక్​ ర్యాలీ.. 1650 కిలోమీటర్లు ప్రయాణించి.. - వైరల్ వీడియోలు

By

Published : Mar 23, 2023, 10:03 PM IST

75 మంది మహిళ సీఆర్​పీఎఫ్​ జవాన్లు.. బైక్​లపై దేశ రాజధాని దిల్లీ నుంచి ఛత్తీస్​గఢ్​.. బస్తర్​ జిల్లాలోని జగదల్​పుర్ పయనమయ్యారు. 84వ సీఆర్​పీఎఫ్​ డే సందర్భంగా.. జగదల్​పుర్​లో జరగనున్న వేడుకల్లో వీరు పాల్గొంటారు. మొత్తం 1848 కిలోమీటర్లు వీరు ప్రయాణించనున్నారు. కాగా గురువారం వరకు 1650 కిలోమీటర్ల ప్రయాణించి ఛత్తీస్​గఢ్​లోని ధమ్​తరికి చేరుకున్నారు. వీరికి ఆ ప్రాంత ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. పూలమాలలతో సాదరంగా ఆహ్వానం పలికారు. మార్చి 9న ఇండియా గేట్​ నుంచి.. వీరంతా బైక్​లపై ర్యాలీగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. మార్చి 25న వీరి ప్రయాణం జగదల్​పుర్​కు చేరుకుంటుంది. మహిళా సాధికారతను సమాజానికి చూపించడమే బైక్ ర్యాలీ యొక్క ఉద్దేశ్యమని జవాన్లు చెబుతున్నారు. వివిధ గ్రామాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో ఆగి మహిళలను చైతన్యపరుస్తున్నామని వారు వెల్లడించారు. దిల్లీ నుంచి ఆగ్రా, గ్వాలియర్, శివపురి, భోపాల్, నాగ్‌పుర్ మీదుగా వీరి యాత్ర సాగింది. సాంకేతిక నిపుణులు, డాక్టర్లు వీరిని అనుసరిస్తూ వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details