సెలవు రోజు కావడంతో కిక్కిరిసిన యాదాద్రి - అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు
Crowd of Devotees Increased in Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతుంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈమేరకు లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కళ్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST