తెలంగాణ

telangana

Crowd of devotees in Yadadri

ETV Bharat / videos

Crowd of devotees in Yadadri on Independence Day : స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యాదాద్రిలో భక్తుల రద్దీ.. - తెలంగాణ తాజా వార్తలు

By

Published : Aug 15, 2023, 5:21 PM IST

Crowd of devotees in Yadadri on Independence Day : తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి భక్తులతో కిటకిటలాడింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యాదాద్రి చుట్టు పక్కల జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వయంభువులకు నిత్యారాధనలు చేపట్టిన పూజారులు ప్రాకార మండపంలో కల్యాణం, అలంకార సేవోత్సవాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రత్యేక పూజలతో  భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతవరణం నెలకొంది. పార్కింగ్, కోనేరు, గుట్ట దిగువన భక్తుల కోలాహలం నెలకొంది. ప్రస్తుతం యాదాద్రీశ్వరుని ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కళ్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరో వైపు ఆలయ పరిసరాలను అధికారులు సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details