తెలంగాణ

telangana

ETV Bharat / videos

PRATIDWANI: పంటనష్టం పరిహారం... ఎంతెంత దూరం? - ETV SPECIAL DISCUSSION

By

Published : Sep 2, 2022, 8:47 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

() రైతన్నలకు ఏడాదికి పద్నాలుగున్నర వేల కోట్లు రైతుబంధు సాయం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. పంటనష్టపోయిన అదే అన్నదాతల్ని.. చిన్నపాటి సాయంతో ఆదుకోవడంలో మాత్రం ఇబ్బంది పడుతోంది. విషయం ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. PRATIDWANI: 2020నాటి పంట నష్టం పరిహారం విషయంపై రైతు స్వరాజ్య వేదిక దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అసలు పంట నష్టం పరిహారం విషయంలో వివాదం ఇంత వరకు ఎందుకు వచ్చింది? మూడేళ్లుగా ప్రధానమంత్రి పంటల బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయడం నిలిపివేసిన రాష్ట్రప్రభుత్వం ప్రత్యమ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details