CPM Tammineni Veerabhadram Fires on BJP BRS : మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా : తమ్మినేని - బీజేపీపై తమ్మినేని ఫైర్
Published : Oct 10, 2023, 6:53 PM IST
CPM Tammineni Veerabhadram Fires on BJP BRS : బీజేపీకు వ్యతిరేకంగా పని చేసే పార్టీలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో అన్ని మోసపూరిత ప్రకటనలు చేస్తూ పాలన చేస్తుందని విమర్శించారు. దేశంలో కుల గణన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమి మాత్రమే దేశంలో కులగణన చేసేలా ఉంది. అందుకే ప్రజల మద్ధతు వారికి ఉండే అవకాశం ఉంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్తో బీజేపీ సన్నిహితంగా ఉంటుందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం ప్రకటించిన నిరుద్యోగ భృతి ఇంకా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు తమ డిమాండ్లకు అనుకూలంగా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్కు ధైర్యం ఉంటే కాంగ్రెస్ను మించిన పథకాలని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.