చరిత్రను 'అమిత్‌షా' వక్రీకరించ వద్దు: సీపీఐ నారాయణ - ప్రజా కోర్టును తప్పించుకోలేరన్న నారాయణ
Narayana Fires on Union Home Minister Amit Shah: తెలంగాణ విమోచన దినోత్సవంపై హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. నేర చరిత్ర ఉన్న అమిత్ షా... చరిత్రను వక్రీకరించడం తగదని మహబూబాబాద్ జిల్లా సీపీఐ కార్యాలయంలో తెలిపారు. భారత స్వాతంత్ర్య, నైజాం వ్యతిరేక పోరాటాలలో RSS, భాజపాలకు ఎటువంటి సంబంధం లేదని వివరించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో సీపీఐ 4వేల 500మందికి పైగా కోల్పోయిందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిందని వెల్లడించారు. రాహుల్ గాంధీకి రాజకీయ మరణ దండన విధించారని నారాయణ మండిపడ్డారు. పార్లమెంట్, కోర్టుల నుంచి తప్పించుకున్నా, ప్రజా కోర్టును తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది.. రేపు మరొకరికి జరగొచ్చని, ఉరి శిక్ష పడ్డ వారికి కూడా చివరి కోరికను అడుగుతారని.. కానీ, ఆయనను చివరి కోరికను కూడా అడగలేదని నారాయణ మండిపడ్డారు. పార్లమెంట్, కోర్టుల నుంచి తప్పించుకున్నా ప్రజా కోర్టును ఎప్పటికీ తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.