తెలంగాణ

telangana

CPI Narayana Comments on CM Jagan visit KCR

ETV Bharat / videos

కేసీఆర్‌తో సీఎం జగన్ భేటీ రాజకీయంలో భాగమే : నారాయణ - సీపీఐ నారాయణ

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 3:47 PM IST

CPI Narayana Comments on CM Jagan meet KCR : కేసీఆర్‌తో సీఎం జగన్ భేటీ రాజకీయంలో భాగమేనని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ పోలింగ్ రోజే నాగార్జున సాగర్ వివాదం తెరపైకి తెచ్చి రెండు రాష్ట్రాల మధ్య గొడవ సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సెంటిమెంట్ రెచ్చ గొట్టి కేసీఅర్​ను మళ్లీ గెలిపించాలని జగన్ చూశారని నారాయణ ఆరోపించారు. ఇప్పుడు తనను గెలిపించేందుకు ఏదైనా చేయమని కోరేందుకు జగన్ కేసీఆర్​ను కలిశారని విమర్శించారు. 

సీఎం జగన్​కు ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో కేసీఆర్​కు ప్రజావ్యతిరేక గాలి వీచినట్లు, ప్రస్తుతం జగన్​కు ఏపీలో తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. వైయస్​ షర్మిలకు కాంగ్రెస్​ అధ్యక్ష పదవి దేవుడెరుగు కానీ జగన్​కు మాత్రం మొదటిసారిగా భయం పట్టుకుందన్నారు. తన కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా అందరూ దూరమయ్యారన్నారు. ప్రతిపక్షాలు తన కొంపలో చిచ్చు పెట్టాయని జగన్​ విమర్శిస్తున్నారని అందులో వాస్తవం లేదని జగనే తన కొంపలో చిచ్చు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా బీజేపీ కుట్ర పన్నుతోందని నారాయణ ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details