CPI Leader Narayana Spoke to Lokesh on Phone: చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన సీపీఐ నారాయణ.. లోకేశ్‌కు ఫోన్ - చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో సంబరాలు
Published : Sep 11, 2023, 4:00 PM IST
CPI Leader Narayana who Spoke to Lokesh on Phone: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అయితే, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ పలు పార్టీలు ఇప్పటికే ఖండించాయి. కేవలం కక్షపురితంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబును ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించాయి. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ రాష్ట్రవ్యాప్తం బంద్‌కు పిలుపునివ్వగా... పలుపార్టీలు సైతం టీడీపీ బంద్ పలుపుకు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా చంద్రబాబును అరెస్ట్‌పై సీపీఐ నేత నారాయణ స్పందించారు.
లోకేశ్‌కి ఫోన్ చేసిన నారాయణ: చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్ట్‌ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI national secretary Narayana) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కి ఫోన్ చేసి పరామర్శించారు. బంద్‌కి సంపూర్ణ మద్దతు తెలిపామని లోకేశ్‌కు తెలిపారు. నియంత పాలనపై అందరూ కలిసి పోరాడదామని లోకేశ్‌తో అన్నారు. బంద్‌కి మద్దతు ఇచ్చినందుకు నారాయణకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.