స్టెప్పులతో అదరగొట్టిన నారాయణ.. వీడియో వైరల్ - విజయవాడ వార్తలు
రాజకీయ నేతలపై ఆరోపణలే కాదు.. అప్పుడప్పుడు చిలిపి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తన రూటే సెపరేటు అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యవహారం. తాజాగా విజయవాడ అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ హాల్లో యోగా చేసిన నారాయణ.. అనంతరం జుంబా ప్రాక్టీస్ చేస్తున్న గ్రూప్ సభ్యులతో కలిసి డాన్స్ చేశారు. స్టెప్పులతో అదర గొట్టారు. యువతతో కలిసి కాలు కదిపి వారిని ఉత్సాహపరచడమే కాకుండా ఆయన సైతం ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
నారాయణ డ్యాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. డీజే మ్యూజిక్‌తో సినిమా పాటలకు స్టెప్పులతో నారాయణ అలరించారు. అక్కడ ఉన్న యువకులంతా నారాయణ వేసే డ్యాన్స్ చూస్తూ కేరింతలు కొట్టారు. యువతి, యువకులకు ఏమాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేశారు. ఓ సందర్భంలో యువకులను మించి అభినయం చేస్తూ యువతకు ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా డ్యాన్స్ చేశారు.