CPI Leader Kunamneni Responded on Chandrababu Arrest : 'చంద్రబాబు పట్ల ఏపీ ప్రభుత్వ తీరు సరికాదు.. ఈ అరెస్టును అందరూ ఖండిస్తున్నారు' - CPI React on Chandrababu Arrest in AP
Published : Sep 15, 2023, 6:02 PM IST
CPI Leader Kunamneni Responded on Chandrababu Arrest : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పందించారు. చంద్రబాబు తప్పు చేశారా, ఒప్పు చేశారా తనకు తెలియదని.. ఆయనను అరెస్ట్ చేసిన విధానం మాత్రం సరైనది కాదని అన్నారు. ఎఫ్ఐఆర్లో చంద్రబాబు(Chandrababu) పేరు లేకుండా.. ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సామాన్యుడినే అరెస్ట్ చేసినప్పుడు అతడి తప్పు చెప్పి చేయాలని.. అలాంటిది ఎందుకు చేస్తున్నారో చెప్పకుండా చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
CPI React on Chandrababu Arrest: ఈ అరెస్ట్.. దేశంలో రాజకీయ పరిస్థితుల మార్పులకు సంకేతంగా భావిస్తున్నామని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. భారతదేశ సమాజానికి, సంస్కృతికి ఇలాంటివి మంచివి కావని హితవు పలికారు. ఇలాంటి చర్యలు దేశంలో ఎక్కడ జరిగినా సీపీఐ పార్టీ స్పందిస్తుందని స్పష్టం చేశారు. నిరంకుశ పోకడలు తగవని.. కక్షా రాజకీయాలు ఎవరు చేసినా మంచిది కాదని అన్నారు. ఈ విషయంలో ప్రముఖ నాయకులందరూ స్పందించారని.. అందరూ ఖండించారని గుర్తు చేశారు.