CPI Chada Venkat Reddy Interesting Comments : 'సీఎం కేసీఆర్ పొమ్మనలేక పొగ బెట్టారు.. అలా అయితే బీఆర్ఎస్ను ఓడిస్తాం' - చాడ వెంకట్ కామెంట్స్
Published : Sep 2, 2023, 10:35 PM IST
CPI Chada Venkat Reddy Interesting Comments: ముఖ్యమంత్రి కేసీఆర్ తమను పొమ్మనలేక.. పొగబెట్టారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో చాడ వెంకట్రెడ్డి మాట్లాడారు. కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. బీజేపీతో కేసీఆర్ (CM KCR) లోపాయికరమైన ఒప్పందం కుదుర్చుకుంటే.. బీఆర్ఎస్ పార్టీని కూడా రాష్ట్రంలో ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
Chada Venkat Reddy Fire on CM KCR : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో బలమైన చోట పొత్తులో భాగంగా తమకు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్, తమను సంప్రదించకుండానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారని ఆరోపించారు. తమకు బలమైన స్థానాల్లో ఏ రాజకీయ పార్టీతో పొత్తులు ఉన్నా లేకున్నా పోటీ చేస్తామని పునరుద్ఘాటించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా తమతో మాట్లాడుతున్నారని, 'ఇండియా' కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటు విషయమై చర్చలు జరుగుతున్నాయన్నారు.