Continental Hospital Offer to SBI Retire Employees : బ్యాంకర్లు, వైద్యుల మాదిరిగా సమాజ అవసరాలకు సంరక్షకులు : డాక్టర్ గురు ఎన్ రెడ్డి - విశ్రాంత ఎస్‌బీఐ ఉద్యోగుల న్యూస్
Continental Hospital Free Medical Camp For SBI Retire Employees :హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. కాంటినెంటల్ ఆసుపత్రి వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఈ క్యాంప్‌ను ప్రారంభించారు. విశ్రాంత ఎస్‌బీఐ ఉద్యోగుల సేవలు విలువకట్టలేనివని.. బ్యాంకర్లు, వైద్యుల మాదిరిగా సమాజ అవసరాలకు సంరక్షకులుగా ఉంటారని ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అన్నారు. జీవిత కాలంలో దీర్ఘకాలిక వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎస్‌బీఐ పదవీ విరమణ చేసిన వారితో పాటు వారి కుటుంబసభ్యులకు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ప్రోత్సహించడంలో వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ఇప్పటికి సుమారు 500 మంది విశ్రాంత ఎస్‌బీఐ అధికారులు వారి కుటుంబ సభ్యులు ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని పలు రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని కాంటినెంటల్ ఆసుపత్రి ఛైర్మన్ తెలిపారు.