Container Ran On Road Without Driver : డ్రైవర్ లేకుండా రోడ్డుపై కంటైనర్ పరుగులు.. కార్లు, బైక్‌లు ధ్వంసం - ఫతేహ్బాద్లో కమీషనర్ ఆఫీస్‌ను ఢీకొన్న కారు
Published : Sep 20, 2023, 12:22 PM IST
Container Ran On Road Without Driver : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ కంటైనర్ ట్రక్కు డ్రైవర్ లేకుండానే పరుగులు పెట్టింది. ట్రాన్స్ యమునా పోలీస్ స్టేషన్ పరిధిలోని టెడి బాగియా కూడలి సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింిది. వస్తువులు సేకరించేందుకు కిందకు దిగిన లారీ డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయడం మరచిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ లేకుండా రోడ్డుపై కదులుతున్న లారీని చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పరుగులు తీయడం మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది. లారీ దూసుకెళ్లడం వల్ల రోడ్డు పక్కన ఉంచిన రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసమవ్వగా.. కొంత మంది బైకర్లతో పాటు ఓ చిన్నారికి గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
కమిషనర్ ఆఫీస్‌లోకి దూసుకెళ్లిన కారు..
Car Crashed Commissioner Office Wall : మరోవైపుఫతేహ్బాద్ రోడ్డులోని కమిషనర్ కార్యాలయ గోడను ఓ గుర్తుతెలియని కారు ఢీకొట్టింది. అతివేగంతో దూసుకెళ్తూ కారును డ్రైవర్ అదుపుచేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కొద్దిసేపటికే సంబంధిత పోలీసులు ఆఫీస్ వద్దకు చేరుకుని ఘటనా స్థలిని పరిశీలించారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి వైద్య పరీక్షలకు తరలించినట్లు తెలిపారు. ఆ తర్వాత డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటమని అన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.