తెలంగాణ

telangana

మోదీ రోడ్‌షో మార్గాన్ని కడిగిన కాంగ్రెస్

ETV Bharat / videos

'మోదీ రోడ్​ షోతో దారి అపవిత్రం'.. ఆవుమూత్రం, పేడతో కడిగిన కాంగ్రెస్​ కార్యకర్తలు - ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

By

Published : May 15, 2023, 12:47 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ రోడ్​ షో నిర్వహించిన.. బెంగళూరులోని మైసూర్​ మార్గాన్ని కాంగ్రెస్​ శ్రేణులు శుభ్రం చేశారు. ఆవు మూత్రం, పేడతో ఆ మార్గాన్ని క్లీన్ చేశారు. ఇక్కడ చాముండేశ్వరి మాత ఊరేగింపు జరుగుతుందని.. మోదీ రోడ్​ షో నిర్వహించడం వల్ల ఆ మార్గం అపవిత్రమయిందని కాంగ్రెస్​ కార్యకర్తలు ఆరోపించారు. అందుకే మైసూర్​ రోడ్డును కడిగినట్లు వారు వెల్లడించారు. ఆదివారం మైసూరు కేఆర్ సర్కిల్ వద్ద కాంగ్రెస్​ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

"దసరా రోజు 'జంబూ సవారీ' ఊరేగింపు జరిగే రాజమార్గాన్ని మోదీ రోడ్ షో నిర్వహించి అపవిత్రం చేశారు. మేము మైసూరు రాజకుటుంబానికి, చాముండేశ్వరి దేవికి భక్తులం. మోదీ రోడ్‌షో వల్ల మేమంతా చాలా బాధపడ్డాం. చాముండేశ్వరి దేవి శాపం వల్లే బీజేపీ ఎన్నికల్లో ఓడిపోయింది." అని ఓ కాంగ్రెస్​ కార్యకర్త పేర్కొన్నాడు. అయితే పోలీసుల ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ముగ్గురిపై కేసు నమోదు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఏప్రిల్​ 30న మైసూర్ గన్ హౌస్ సర్కిల్ నుంచి హైవే సర్కిల్ మోదీ రోడ్​ షో నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details