Congress Warroom Incharge Interview : 'సోషల్ మీడియాల్లో కాంగ్రెస్ ఆరు హామీలను విస్తృతంగా ప్రచారం చేయడం కోసం వార్‌రూమ్' - కాంగ్రెస్ వార్‌రూమ్ ఇన్‌ఛార్జి ఇంటర్వ్యూ
Published : Oct 31, 2023, 7:00 PM IST
Congress Warroom Incharge Interview :తెలంగాణలో కాంగ్రెస్(Telangana Congress) పార్టీ గెలుపే లక్ష్యంగా.. కర్ణాటక తరహా వ్యూహంతో ఏఐసీసీ ముందుకు వెలుతోంది. తెరవెనుక నుంచి పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించండం, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శిక్షణ ఇవ్వడం, సామాజిక మాద్యమాలల్లో కాంగ్రెస్ ఆరు హామీలను విస్తృతంగా ప్రచారం చేయడం కోసం వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన వార్ రూమ్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన 75 మంది యువత.. పది విభాగాల్లో పని చేస్తున్నారు. వార్ రూమ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఏవిధంగా దోహదపడుతుందో చెబుతున్న వార్ రూమ్ ఇన్‌ఛార్జి సంతోశ్ రుద్రతో ఈటీవీ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.
'తెలంగాణలో ఉన్న వార్ రూమ్‌ని గత నెల 27వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి వార్ రూమ్ ఛైర్మన్‌గా రోహన్ గుప్తా వచ్చారు. పార్టీ విధివిధానాలకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా తెలంగాణలో ఈ వార్ రూమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది.' -సంతోశ్ రుద్ర, కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్‌ఛార్జి