గాంధీభవన్ వద్ద అంబరాన్నంటిన సంబురాలు - తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం
Published : Dec 3, 2023, 3:27 PM IST
Congress, Telangana Election Result 2023 LIVE: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దిశగా ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండటంతో గాంధీ భవన్కు భారీగా కార్యకర్తలు చేరుకుని సంబురాల్లో మునిగి తేలుతున్నారు.
Congress Celebrations at Gandhi Bhavan Hyderabad : : కాంగ్రెస్ నివాసానికి కాంగ్రెస్ నాయకులు ఒక్కక్కరుగా చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. దాదాపు 60 కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ బలపడుతున్న నేపథ్యంలో కార్యకర్తలు గాంధీ భవన్కు క్యూ కడుతున్న నేపథ్యంలో బందోబస్తు కోసం పోలీసులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గస్తీ నిర్వహించనున్నారు. సగానికి పైగా కార్యకర్తలు ఇప్పటికే పార్టీ కార్యాలయానికి చేరుకుని సంబురాలు చేసుకుంటున్నారు.